ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

211
sirivennela
- Advertisement -

దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. ఫిలిం ఛాంబ‌ర్ నుండి మ‌హాప్ర‌స్ధానం వ‌ర‌కు సిరివెన్నెల అంతిమ‌యాత్ర సాగింది. మహాప్ర‌స్థానంలో వారి ఆచారం ప్ర‌కారం పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు. సిరి వెన్నెల పార్ధివ దేహాన్ని ఉంచ‌గా, క‌డ‌సారి చూపు చూసేందుకు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఆయన‌తో ఉన్న అనుబంధాన్ని త‌ల‌చుకుంటూ భావోద్వేగానికి గుర‌య్యారు.

సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తులు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్‏ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.

- Advertisement -