గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న అరుణ రాఘవ రెడ్డి..

250
zptc aruna
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించిన హరిత హారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చేపట్టారు ఎంపీ సంతోష్‌ కుమార్‌. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,టీయూడబ్ల్యూజె సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల రగుడు చౌరస్తా వద్ద బైపాస్ రోడ్‌లో కొత్త కలెక్టరేట్ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మొక్కలు నాటారు.

siricilla

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మి నారాయణ,ప్రధాన కార్యదర్శి తీగల మల్లి కార్జున్,జిల్లాలోని పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -