రైతుల అభిమానం చూరగొనాలి: నిరంజన్‌ రెడ్డి

805
niranjan reddy
- Advertisement -

ఖమ్మం మార్కెట్ కమిటీ పాలక మండలి రైతుల అభిమానం చూరగొనాలని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఓట్లు వేసిన ప్రజల అభీష్టం మేరకు మనం నడుచుకోవాలని తెలిపారు.రాష్ట్రంలో ఖమ్మం , వరంగల్ మార్కెట్లు కీలకమైన మార్కెట్లు …ప్రజలు సంతోషం గా , సుఖం గా ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన అని తెలిపారు.

స్థానిక వనరులు ప్రజల కోసం ఖర్చు చేయడం కేసీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం ..ఉద్యమ సమయంలో ప్రజలు , రైతుల కష్టాలను కేసీఆర్ తెలుసుకున్నారు..గడచిన ఐదారేళ్ళ లో రాష్ట్ర లో పంటల దిగుబడి బాగా పెరిగింది ..కాళేశ్వరం, సీతారామ పూర్తి కాకముందే ఇంత పంట పండితే.. పూర్తిగా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కోటి ఎకరాలలో పంట పండుతుందన్నారు.

సమగ్ర మార్కెటింగ్ విధానం అవసరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద సీఎం కేసీఆర్ గారూ దృష్టి పెట్టారు.కేసీఆర్ గారి రైతులకు సబ్సిడీ , రుణ మాజీ, పంటసాయం చేయడం తో రైతులలో ధైర్యం పెరిగింది ..

ఖమ్మం మార్కెట్ యార్డ్ కు అదనపు స్థలం విషయం సీఎం గారి దృష్టికి తీసుకెళతాం పామాయిల్ లో ఖమ్మం జిల్లా అగ్ర బాగాన ఉన్నది ..వైవిద్యమైన పంటలు , క్రాప్ కాలనీల ఏర్పాటు సీఎం గారి ఆలోచనఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల అనేక మంది కి లబ్ది, ఉపాధి దొరికుతుంది.కాళేశ్వరం కడుతుంటే కేసీఆర్ గార్ని హేళన గా మాట్లాడారని గుర్తుచేశారు.

కానీ మూడేళ్ల నీళ్లు దూకించిన మొనగాడు కేసీఆర్ తెలంగాణ లో రైతుకు ఇస్తున్న భరోసా దేశంలో , ప్రపంచంలో ఎక్కడ లేదు..అనేక లక్షల మంది కి పెన్షన్లు ఇస్తున్నాం పుట్టిన బిడ్డనుంచే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి..మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాల ముందు కేంద్రం చేస్తున్నది చాలా తక్కువ…మిషన్ భగీరథ కు 24 వేల కోట్లు ఇల్వాలని నీతి ఆయోగ్ చెప్పినా, కేంద్రం ఇవ్వలేదు .. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాలి..వ్యవసాయం లాభసాట గా చేయ్యాలనేది సీఎం కేసీఆర్ గారి కల త్వరలోనే రైతులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, వ్యవసాయం లో విభిన్నత గలిగిన ఖమ్మం జిల్లా కు వ్యవసాయ శాఖ తరపున అన్నిరకాల అండగా ఉంటామని స్పష్టం చేశారు.

- Advertisement -