‘సవ్యసాచి’ తో వస్తోన్న సింగర్ సునీత కూతురు

291
singer sunitha doughter
- Advertisement -

తెలుగు సినీ ప్రియులకి పరిచయం అక్కర్లేని పేరు సింగర్ సునీత. ఆమె పాడే పాటలే కాదు… మాట్లాడే మాటలు కూడా అంతే తియ్యగా వుంటాయంటుంటారు ఆమె అభిమానులు.తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. కాని ప్రేక్షకులు గుర్తించ దగ్గ సింగర్స్ మాత్రం కొద్ది మందే ఉంటారు. ఎక్కువ శాతం సింగర్స్ ఇలా వచ్చి అలా వెళ్లి పోతూ ఉంటారు. కాని కొందరు సింగర్స్ మాత్రం అలా ఉండి పోయారు. అందులో ఒకరు సింగర్ సునీత. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు సునీత. 

ఇప్పుడు సునీత తన కూతురు శ్రియను కూడా సింగర్‌గా పరిచయం చేస్తున్నారు. శ్రియ నాగచైతన్య ‘సవ్యసాచి’లో సంగీత దర్శకుడు కీరవాణి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ కీరవాణి ట్విట్ చేశారు. . ‘సునీత కుమార్తె శ్రేయా గోపరాజును ‘సవ్యసాచి’లోని డ్యుయెట్‌తో గాయనిగా పరిచయం చేస్తున్నా. ఆమెది తన తల్లిలాంటి స్వరం కాదు.. పూర్తిగా పాశ్చాత్య ఫీల్‌ కలిగింది’ అని తెలిపారు.

shreyagokaraju

దీనిపై స్పందించిన సునీత కీరవాణికి ధన్యవాదాలు తెలిపింది. ‘అవును నా కుమార్తె నేపథ్య గాయనిగా ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘సవ్యసాచి’తో పరిచయం కాబోతోంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రికార్డింగ్‌ సెషన్‌లో శ్రేయా చాలా భయపడింది. కీరవాణిగారు చాలా సేపు మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఇది చూశాక ఆయనతో నా తొలి రికార్డింగ్‌ గుర్తొచ్చిందని, త్వరలో తన కూతురు పాడిన ఈ పాట విడుదల కాబోతోంది. గర్వంగా ఉంది’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. ‘సవ్యసాచి’కి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నాగ చైతన్యకి జంట నిధి అగర్వాల్ జతకట్టనుంది. భూమిక, మాధవన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ కూడా తన తల్లిలాగే అద్భుతమైన గాత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సింగర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని మనమూ కోరుకుందాం.

- Advertisement -