నెటిజన్ నోటిదూల..సింగర్ సునిత సూపర్బ్ కౌంటర్

92
singer sunitha
- Advertisement -

ఓ నెటిజన్ నోటిదూలకు సింగర్ సునిత అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సమానత్వానికి మారుపేరుగా ఆవిష్కరిస్తున్న రామానుజులు విగ్రహాన్ని సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సునీత. దీనికి ఓ నెటిజన్ తన నోటికి పదునుచెబుతూ ఎటకారంగా పోస్ట్ చేశాడు.

కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్‌ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన సునీత …నోటి దూల నీది. నీ భారం భూమిది అంటూ కౌంటర్ ఇవ్వగా ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిజిటల్ మీడియా అగ్రగామి రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతున్న సునీతపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

- Advertisement -