సింగర్ సునీత సంచలన నిర్ణయం.. త్వరలో మరో పెళ్లి?

1263
singer sunitha

సింగర్‌ సునీత.. పరిచయం అక్కరలేని పేరు. సునీత పాట కమ్మనైన అమ్మ జోలపాట, సునీత పాట ప్రేమికుల మనసును హత్తుకునే మధురమైన పాట.. సునీత పాట అభిమానులను అలరించే అద్భుతమైన పాట. సునీత పాటే కాదు.. పలుకు బంగారమే.. తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే ఘనత.. తనే సింగర్‌ సునీత ఉపద్రష్ట.

singer sunitha

అది 1995వ సంవత్సరం.. విజయవాడ నుంచి ఒక లేత గొంతుక బయలుదేరింది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావ్‌ అంటూ అందరిని కవ్వించేలా, మైమరిపించేలా, హృద్యంగా పాడింది. మొదటి పాట పాడిన వెంటనే గొంతు ఎందుకు ఇంత సన్నగా ఉంది.. ఈ అమ్మాయి పాడుతుందా.. నిలబడుతుందా.. అని ప్రశ్నించిన వారు ఉన్నారు. ఇంత హాయిగా ఉందే ఈ గొంతు.. ఈ అమ్మాయి పాటలు ఎప్పుడు పాడుతుంది అని వెయిట్‌ చూసిన వాళ్లు ఉన్నారు. అప్పటి నుంచి తన ప్రయాణం మొదలు పెట్టిన సునీత అంతటితో ఆగకుండా ఒక్కో పాట పాడుతూ.. పాట పాటకు తనలోని ప్రావీణ్యాన్నీ నిరూపించుకంటూ, అన్ని అందమైన పాటలు పాడిన సునీత అక్కడితో ఆగకుండా ఒక డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, తన పాటతో పాటు తన మాట కూడా అంత మృదువుగా, అంత సులభంగా, వినసొంపుగా, అందంగా ఉందని నిరూపించుకుంటూ వెళ్లవయ్యా వెళ్లు.. అనే డైలాగ్‌ను అంత అందంగా చెప్పి చూపించింది. సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే కాకుండా యాంకర్‌గా కూడా పలు కార్యక్రమాల్లో రాణించింది.

singer sunitha

టాలీవుడ్‌లో తన సుమధుర గాత్రంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఆ వార్త ఏంటంటే ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్‌ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు.

singer sunitha

19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. గత కొంత కాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఆమె పెళ్లి చేసుకుంటారన్న వార్తల్లో నిజం ఎంతో… ఆమె నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.