సింగర్ సునీత మళ్లి పెళ్లి చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈవార్తలపై సింగర్ సునీత క్లారీటి ఇచ్చింది. చాలా రోజుల తర్వాత నా ఫోను మెసేజ్ ల ద్వారా నిండిపోయిందని చెప్పింది. నాకు అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇంతమంది ఫోన్లు చేయలేదని..ఇంత పాజిటివ్ గా నాకు పెళ్లి విషయంపై స్పందిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు సింగర్ సునీత. నాకు తెలియకుండా సోషల్ మీడియా నిన్ననే నాపెళ్లి పిక్స్ చేసిందంటూ ట్వీట్ చేసింది సునీత. నా పెళ్లి విషయం చాలా సంతోషకరమే కానీ అలాటింది ఏమి లేదన్నారు.
ఒకవేళ మళ్లి పెళ్లి గనుక చేసుకుంటే మీకు తప్పకుండా చెబుతానని ట్వీట్ చేసింది. సోషల్ మీడియా తలచుకుంటే ఏదైనా చేస్తారని చెప్పింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండో పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే సునీత కూడా రెండో పెళ్లి చేసుకుంటందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే అని..అవన్ని పుకార్లే అని చెప్పింది. చాలా ఫైట్ చేసి ఈమధ్య కాలంలోనే విడాకులు తీసుకున్నానని ప్రస్తుతం చాలా హ్యాపిగా ఉన్నానని చెప్పింది.
నేను మళ్లి పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. మా అమ్మనాన్న కూడా నాపెళ్లి గురించి మాట్లాడారని మళ్లి పెళ్లి చేసుకుని హ్యాపిగా ఉండమని చెప్పారన్నారు. ఇక మా అబ్బాయి కూడా ఈవిషయంపై నాకు ఫోన్ చేశాడని చెప్పింది. వాడు నాకు ఫోన్ చేసి అమ్మా పెళ్లి డేట్ ఎప్పుడు అని అడిగాడని..వాడు నిజంగానే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాడని తెలిపింది. సింగర్ సునీత వ్యవహారం చూస్తుంటే త్వరలో మరో పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.