ప్రముఖ సింగర్ కల్పన తన ఇంట్లో ఆత్మహత్య యత్నం చేసుకుంది. భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నానంటూ చెప్పడంతో ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు.
వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేపీహెచ్‌బీలోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు.
2010లో మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని 2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్‌ను పెళ్లిచేసుకుంది కల్పన. రెండ్రోజుల క్రితం ఆమె భర్త చెన్నై వెళ్లగా ఇంట్లో కల్పన ఒక్కరే ఉన్నారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు తన భర్తకు ఫోన్ చేసి నేను ఆపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను అని చెప్పగా వెంటనే కాలనీ వాసులకు సమాచారం అందించారు.
Also Read:మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్

