37 ఏళ్ల వయసులో తల్లినయ్యా!

62
singer
- Advertisement -

తాను 37 ఏళ్ల వయస్సులో తల్లినయ్యానని తెలిపారు సింగర్ చిన్మయి శ్రీపాద. ఇటీవలె కవల పిల్లలకు జన్మనివ్వగా తన ప్రెగ్నెన్సీ జర్నీని వివరించింది. తాను, రాహుల్‌ చాలా రోజులనుంచి పేరెంట్స్ అవ్వాలనుకున్నాం. 2020లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలనుకున్నాం కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు.

ఇక సెకండ్ వేవ్ సమయంలో తొలిసారి ప్రెగ్నంట్ అయ్యాను కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో అబార్షన్ అయిందని తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లి పోయానని తెలిపారు. కొన్నిరోజుల తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడికల్‌ డాక్టర్‌ ఎమిలీ అనే ఆవిడ పరిచయం అయ్యింది…. తన సలహాలతో డైట్‌, ఎక్సర్‌సైజ్‌ అన్నీ పాటించాను. కొంతకాలానికి మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిపింది.

- Advertisement -