రామగుండంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు..

164
singareni
- Advertisement -

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎం కల్వల నారాయణ మాట్లాడుతూ… బొగ్గు ఉత్పత్తి నేపథ్యంలో ఓసీపీ – 5 ఏర్పాటు వల్ల నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుతామని అన్నారు. మురుగునీటి ని శుభ్రం చేసేందుకు సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ సమతుల్యత, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కి యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. అధికారుల, ఉద్యోగుల సమిష్టి కృషితో భవిష్యత్తులో రామగుండం- 1 లో రోజుకు 15 నుండి 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని అన్నారు.

- Advertisement -