గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ బలరాం..

683
Singareni Director Balram Naik
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా గొలేటి గ్రామంలోని సేవాలాల్ మహారాజ్ గుడి ప్రాంగణంలో 84 మొక్కలు నాటారు సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్. అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ మొక్కలు పెంచుకోవాలని మొక్కలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. ఈ భూమండలంపై పచ్చదనంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అందుకోసం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.పచ్చదనం పెంచడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని అందుకు సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -