సీఎం రేవంత్‌ని కలిసిన సింగరేణి సీఎండీ బలరాం

39
- Advertisement -

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌పై సింగ‌రేణి ఛైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ (ఎఫ్ ఏ సి)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎన్‌.బ‌ల‌రామ్ స‌చివాల‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు కొర‌త లేకుండా చూడాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆదేశించ‌గా.. త‌గినంత బొగ్గు ర‌వాణాను ఎటువంటి కొర‌త లేకుండా కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

అలాగే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవ‌స‌రాల కోసం నిరంత‌రాయంగా అంద‌జేస్తామ‌ని బ‌ల‌రామ్ తెలియ‌జేశారు. సింగ‌రేణి సంస్థ బొగ్గు ఉత్ప‌త్తి లోనే కాకుండా సంక్షేమ కార్య‌క్ర‌మంలో నెంబ‌ర్ -1 స్థానంలో ఉండే విధంగా పూర్తిస్థాయిలో కృషి చేస్తామ‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ స‌హ‌కారాలతో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్ప‌త్తిని సాధిస్తామ‌ని బ‌ల‌రామ్ తెలియ‌జేశారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌రియు ఆర్థిక‌, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లును కూడా క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిజేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ముఖ్య కార్య‌ద‌ర్శి శాంతి కుమారిని, అలాగే సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Also Read:గీతాంజలి మళ్లీ వచ్చింది..

- Advertisement -