KTR:సింగరేణి బోనస్ అంతా బోగస్

1
- Advertisement -

సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా తగ్గించడం అంటే, భవిష్యత్తుతో సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని, భాగస్వామ్యాన్ని తగ్గించి సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగానే భావిస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి లాభాల వాటాపైన కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని.. సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి న్యాయం చేయాలన్నారు. తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు అది బోగస్… కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. పండుగ వేళ.. ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది… లాభాల బోనస్ అంతా బోగస్..! ప్రతి సింగరేణి కార్మికుడికి కనీసం లక్షా 80వేలు నష్టం.. అన్నారు. నికర లాభం 4701 కోట్లలో.. న్యాయంగా 33 శాతం వాటా 1551 కోట్ల కావాలి… ప్రతి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు రావాలన్నారు. కానీ కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారు.. ఇస్తే మొత్తంగా లాభాల్లో వాటా ఇవ్వాలి, లేకపోతే మేము ఇచ్చేది కేవలం 16.9% మాత్రమే అని ఒప్పుకోవాలన్నారు. కానీ 33% అంటూ సింగరేణి కార్మికుల లాభాల వాటా పై అసత్యాలు చెప్పవద్దు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మొత్తం పది సంవత్సరాల్లో కార్మికులకు లాభాల వాటా రూపంలో దక్కింది కేవలం 365 కోట్ల రూపాయలు మాత్రమే… కానీ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో లాభాల వాటా రూపంలో సింగరేణి కార్మికులకు అందించింది 2780 కోట్ల రూపాయలు అన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని… ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సంస్థ లాభాలు పది, పదిహేను శాతానికి మించి ఏనాడు ఇవ్వలేదు అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా లాభాలను పెరిగేలా సంస్థ పనితీరును పెంచాము.. ఒక్కొక్క కార్మికుడికి అత్యధికంగా 32% వాటా ఇచ్చాం అన్నారు. సింగరేణి ప్రాంతంలో గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి దగ్గరికి పంపించండి.. సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంలో స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:#SDT18 కోసం 12 ఎకరాల్లో సెట్!

- Advertisement -