సిక్కుల వేషధారణలో సింగపూర్ ప్రధాని..

222
- Advertisement -

సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్ సిక్కుల వేషధారణలో అలరించారు. సిలాత్ రోడ్‌లోని ఓ నవీకరించిన గురుద్వారా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన తెల్లని తలపాగా ధరించి కనువిందు చేశారు. అంతేకాదు, పంజాబీలో “సత్ శ్రీ ఆకాల్” అంటూ పలికి సిక్కులకు అభివాదం చేశారు.

సింగపూర్‌లో కరోనా సంక్షోభం సందర్భంగా సిక్కు సమాజం సేవలు ఎనలేనివని ప్రధాని లీ సేన్ లూంగ్ కొనియాడారు. కరోనా బాధితుల నేపథ్యం, ప్రాంతం, మతం, రంగు ఏమీ చూడకుండా వారికి సేవలు అందించేందుకు సింగపూర్‌లోని గురుద్వారాలు తమ సభ్యులను ఉరుకులు పరుగులు పెట్టించాయని వెల్లడించారు.

అనేక మతాల సమాహారమైన సింగపూర్‌కు సిలాత్ రోడ్‌లోని గురుద్వారా ఒక వెలుగు దివ్వె వంటిదని ప్రధాని లీ సేన్ లూంగ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింగపూర్ సిక్కులు ఆయనకు తమ మత సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఓ ఖడ్గాన్ని బహూకరించారు.

- Advertisement -