కరోనా ఈ పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయగా తాజాగా సింగపూర్‌లో మరో వేవ్ కలకలం రేపుతోంది. సింగపూర్‌లో కరోనా ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది.
అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వి నమోదుకాగా ఆస్ట్రేలియా, డెన్‌మార్క్, భారత్, జపాన్‌తో సహా 17 దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఈ వేవ్ స్వల్ప కాలం పాటు ఉండవచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితిని, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నమని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయడంతోపాటు సురక్షిత పద్ధతులను అమలు చేస్తామని చెప్పారు. సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,997,847కు చేరగా ఇప్పటివరకు కరోనాతో 1,641 మంది మృతిచెందారు.