ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది సింగపూర్. ఈ మేరకు జూలియర్ బేర్ నివేదిక వెల్లడించింది. రెండో స్థానంలో లండన్, మూడో స్థానంలో హాంకాంగ్ ఉన్నాయి. మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలన్స్ ఉన్న ప్రజలు, వారి విలాసాల ఆధారంగా నివేదిక ఇచ్చింది.
రాజకీయ స్థిరత్వం, భద్రత, విద్యా-ఆరోగ్య సేవల గుణాత్మకత కారణంగా నగరం ఇంకా ఆకర్షణగా ఉంది అని తెలిపారు. సింగపూర్ వరుసగా మూడో సంవత్సరం కూడా అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది.
ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు అంతగా స్థిరంగా లేని సందర్భంలో, సింగపూర్ స్థిరత్వం, భద్రత మరియు ఆసియా తో పాటు ఇతర ప్రాంతాలతో ఉన్న అనుసంధానం వల్ల ఎంతో విలువైనదిగా మారింది అని నివేదికలో పేర్కొన్నారు.టాప్ 10 ఖరీదైన నగరాలలో మూడు ఆసియా-పసిఫిక్ నగరాలు చోటు దక్కించుకున్నాయి .హాంకాంగ్ మూడవ స్థానంలో ఉండగా, షాంఘై ఆరో స్థానంలో నిలిచింది.
Also Read:కొత్తపల్లిలో ఒకప్పుడు..పక్కా హిట్!
సింగపూర్ కార్లు మరియు మహిళల హ్యాండ్ బ్యాగ్స్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. మహిళల షూస్ విషయంలో రెండో స్థానంలో, నివాస ప్రాపర్టీలు మరియు ఆరోగ్య సేవలలో మూడవ స్థానంలో ఉంది.

