ఆకలి మీదున్న సింగం…

235
Singam 3 Trailer Official
Singam 3 TrailerSingam 3 Trailer Official Official
- Advertisement -

చిత్రపరిశ్రమలో సిక్వెల్ సినిమాలకు క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిలో విజయాల శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. తమిళం, తెలుగు భాషల్లో సింగం సిక్వెల్స్ వరుస విజయాలతో దూసుకొస్తున్నాయి. సింగం చిత్రం హీరో సూర్యకు తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్‌‌తో పాటు మార్కెట్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఇదే క్రమంలో సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ‘ఎస్‌ 3’ చిత్రం టీజర్‌ సోమవారం విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

నిన్న సాయంత్రం విడుదలైన ఈ చిత్రం టీజర్‌ను ఇప్పటి వరకూ 23 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. అంతేకాదు ఈ టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉండగా, 74,000 మందికి పైగా టీజర్‌ నచ్చిందని లైక్‌ చేశారు. వీడియో అద్భుతంగా ఉంది, సూర్య నటన సూపర్‌ అంటూ అభిమానులు యూట్యూబ్‌లో కామెంట్స్‌ చేశారు. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు.

‘సింగం 2’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డిసెంబరు 16న ‘ఎస్‌ 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింగం 3 ట్రైలర్‌..

- Advertisement -