హైదరాబాదీ షట్లర్ పీవీ సింధుకు ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. 18 ఏండ్ల నిరీక్షణకు ఈసారైన తెరపడుతుందని ఆశీంచిన భారత అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. తొలిరౌండ్‌లోనే ఓటమిపాలై సిరీస్ నుండి తప్పుకుంది సింధు. భారత్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందనుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశపరించింది.
16-21, 22-20, 18-21 తేడాతో సంగ్ జి హ్యున్(కొరియా) చేతిలో పోరాడి ఓడింది. 81 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడి మ్యాచ్‌ను చేజేతులా జార్చుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో సంగ్‌పై సింధు ఓడిపోవడం ఇది మూడోసారి.
మరోవైపు కిదాంబి శ్రీకాంత్,సైనా నెహ్వాల్ తొలిరౌండ్‌లో నెగ్గి ముందంజలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-19, 21-19తో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై అద్భుత విజయం సాధించగా మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-13, 21-11తో బ్రైస్ లెవర్‌డేస్(ఫ్రాన్స్)పై గెలిచాడు.