రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, పలువురు ఆమెకు భారీగా నజరానాలు ముట్టచెప్పారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్స్ సానియా, సైనా నెహ్వాల్‌లకు దీటుగా నేనూ వచ్చేశానంటోంది పీవీ సింధు.. రియో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ విన్నర్ అయిన ఈమె..వాళ్ళ స్థానాన్ని తను భర్తీ చేస్తానంటోంది. జస్ట్ ఫర్ వుమెన్ అనే మహిళల మ్యాగజైన్ కోసం సింధు ఇటీవల ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఫ్లయింగ్ హై – లైఫ్ ఆప్టర్ రియో అంటూ ఆమె గురించి ఓ సుదీర్ఘమైన ఆర్టికల్ ప్రచురించారు.
రియో ఒలింపిక్స్ తర్వాత ఆమె క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ఈ ఆర్టికలే వివరిస్తోంది. ఇక కవర్ పేజ్‌పై సింధు ఫొటో చూస్తే ఆమె ఓ స్పోర్ట్స్ సెలబ్రిటీగానే కాకుండా సినిమా తారలా దర్శనమిస్తోంది. ఇక ఈ ఫొటోలో సింధును చూస్తే స్లీవ్ లెస్ టాప్, ఫ్లవర్ డిజైన్ నెట్టెడ్ షార్ట్ బాటమ్ డ్రెస్ లో టాప్ మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోన్నట్టుగా ఆమె ఉంది. ఈ ఫోటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి.
సింధుతో బేస్ లైన్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ మూడేళ్లకు రూ.50 కోట్ల రూపాయలు చెల్లించి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇది నేషనల్ రికార్డ్ కూడానూ. అవును మరి క్రికెటేతర క్రీడల్లో ఓ క్రీడాకారిణికి ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకోవటం విశేషం. బేస్ లైన్ చాలా కంపెనీలకు బ్రాండింగ్, ఇతర సేవలు అందిస్తుంది.
https://youtu.be/tIMMpT7KlHE