భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు హైదాబాద్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తున్న తనకు విమాన గ్రౌండ్ సిబ్బంది వల్ల చాలా సమస్యలు వచ్చాయన్నారు. గ్రౌండ్ సిబ్బందిలోని అజీతేశ్ అనే వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఆమె ట్వీట్లు వైరల్ అయ్యాయి.
అజితేష్ చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించింది. అయినప్పటికీ ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి” అని మరో ట్వీట్ చేశారు. విమాన ప్రయాణాల్లో దేశీయ క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్‌లు చేదు అనుభవాలను చవిచూశారు.
అయితే.. లగేజీ విషయంలో విమానంలో సింధూతో చిన్న వివాదం చెలరేగిందని.. తను అధిక బరువు ఉన్న లగేజీని తీసుకురావడం వల్ల అది బిన్‌లో పట్టలేదని.. అందుకే సింధూకు విషయం తెలియజేసి దాన్ని కార్గోకు షిప్ట్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొన్నది. ఏ కస్టమర్‌కైనా తాము అవే రూల్స్ ఫాలో అవుతామని ఇండిగో తెలిపింది.
Sorry to say ..i had a very bad experience😤when i was flying by 6E 608 flight to bombay on 4th nov the ground staff by name Mr ajeetesh(1/3)
— Pvsindhu (@Pvsindhu1) November 4, 2017
Please speak to Ms Ashima she wil explain you in detail.🙏🏻
— Pvsindhu (@Pvsindhu1) November 4, 2017