భారత ఏస్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులో ఏరో ఇండియా విమెన్స్ డే వేడుకలను ఈ రోజు నిర్వహించింది. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా స్వదేశంలో తయారైన తేలికపాటి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో సింధు ప్రయాణించింది.
ఈ విమానంలో ఇద్దరు పైలట్లు కూర్చునే వీలుంటుంది. వెనుక సీట్లో కూర్చొని విమానంలో సింధు ప్రయాణించింది. ఈ సందర్భంగా తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
పీవీ సింధు ఈ వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా గగనతలంలోకి ఎగిరింది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు. తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధుకు అరుదైన గౌరవం దక్కింది.