అరవింద్‌తో ఆ హీరోయిన్ చేయదట‌..!

250
- Advertisement -

సౌత్ బ్యూటీ ప్రియమణి..మొదట్లో కొంచం పద్దతిగా ఉన్నా మరి ఇలా ఐతే సరైన ఆఫర్లు రాకపోవడంతో రూటు మార్చి తన హాట్‌ హాట్‌ అందాలను ఆరబోసింది.ఇక అక్కడి నుండి వరుస సినిమాలతో మంచి ఆఫర్స్‌ అందిపుచుకుంది.అన్ని భాషల్లోనూ గట్టి ప్రయత్నాలే చేసింది. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో బోలెడంత గుర్తింపు అయితే దక్కింది కానీ.. ఈమె ట్యాలెంట్ తగినంత స్థాయి అవకాశాలు మాత్రం అందలేదు. చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో షారూక్ ఖాన్ కలిసి ఐటెం సాంగ్ లో డ్యాన్సులు కూడా చేసినా.. కాలం కలిసి రాలేదు. అయితే.. సినిమాల ఎంపిక విషయంలో ప్రియమణి తీసుకునే జాగ్రత్తలే ఈ పరిస్థితి కారణం అంటారు చాలా మంది.

Simran Replace Priyamani in Aravind Swamy Movie

తాజాగా కూడా ఓ అవకాశాన్ని వద్దని చెప్పిందట ప్రియమణి. అరవింద్ స్వామితో.. ఓ మూవీలో నటించే అవకాశం ప్రియమణికి వచ్చింది. తనీ ఒరువన్.. ధృవల తర్వాత తమిళ్.. తెలుగు భాషల్లో మళ్లీ పునర్వైభవం సంపాదించుకున్న అరవింద్‌ స్వామి సెల్వ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ.. కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. అయితే.. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి సినిమా అంతా నటించే ఫ్రెండ్ కం పోలీస్ గా ప్రియమణికి ఆఫర్ వచ్చింది. స్నేహితురాలి రోల్ అనేసరికి.. కుదరదని చెప్పేసిందట ప్రియమణి.

ఆ తర్వాతే ఈ అవకాశం సిమ్రన్ కి దక్కిందని తెలుస్తోంది. మన ఊరి రామాయణం వంటి కాన్సెప్ట్ సినిమాలకు ఓకే చెప్పేసే ప్రియమణి.. కమర్షియల్ మూవీస్ విషయంలో మాత్రం బాగా అలర్ట్ గా ఉంటోంది. అక్కడే ఆమె కెరీర్ ఎప్పుడూ వెనుక పడుతుందని చెబుతున్నారు సన్నిహితులు.

- Advertisement -