అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెజర్) చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే మన జీవితంలో భాగమైపోతుంది. అయితే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే ముఖ్యమైన ప్రమాద కారకాల్లో హైబీపీ ఒకటిగా ఉందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. భారత్‌లోనూ ప్రతి ఏడాది సుమారు 16 లక్షల మరణాలతో ఇది ముడిపడి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది.
అందుకే ఇంట్లోనే క్రమం తప్పకుండా బీపీని చెక్ చేసుకునే వారు సరైన పద్ధతిని పాటించడం చాలా ముఖ్యం. బీపీ కొలవడానికి కొన్ని నిమిషాలే పట్టినా.. అంతకుముందు మనం చేసిన కొన్ని పనులు రీడింగ్‌పై ప్రభావం చూపవచ్చు.
ఈ పనులు చేసిన వెంటనే బీపీ చెక్ చేయొద్దు
వ్యాయామం చేసిన తర్వాత
నడకకు వెళ్లి వచ్చిన వెంటనే
భోజనం చేసిన తర్వాత
టీ లేదా కాఫీ వంటి కెఫీన్ తీసుకున్న తర్వాత
పొగతాగిన తర్వాత
మద్యం సేవించిన తర్వాత
ఈ కార్యకలాపాలు చేసిన వెంటనే బీపీ కొలిస్తే రక్తపోటు తాత్కాలికంగా మారి ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత రీడింగ్ తీసుకోవడం మంచిది.
కచ్చితమైన బీపీ రీడింగ్ కోసం ఇలా చేయండి
Also Read:‘ది ట్రెయిటర్స్’..తెలుగులో!
బీపీ కొలిచేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎడమ చేతిపై రీడింగ్ తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఒక్కసారి మాత్రమే బీపీ కొలిచి ఆపేయకుండా.. మూడు సార్లు రీడింగ్ తీసుకుని, వాటి సగటును లెక్కించాలి. ఇలా చేయడం ద్వారా బీపీకి సంబంధించి మరింత నమ్మకమైన అంచనా పొందవచ్చని ఆమె తెలిపారు.అలాగే బీపీ కఫ్‌ను చేతికి సరైన స్థాయిలో అమర్చడం కూడా చాలా ముఖ్యం. రీడింగ్ తీసుకునే సమయంలో కఫ్ గుండె స్థాయిలో ఉండాలి. కూర్చుని లేదా పడుకుని బీపీ కొలవడం కంటే కఫ్ సరైన స్థితిలో ఉండటం ముఖ్యం.

