టీ 20.. భారత్‌పై విండీస్‌ విజయం..

272
- Advertisement -

తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఘనవిజయం సాధించింది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కరీబియన్లు అన్నిరంగాల్లో భారత్ పై ఆధిపత్యం చెలాయించారు. భారత్ విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి ఛేదించారు. దీంతో, మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 1-1 తో సమమైంది.

171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం దిశగా సాగారు. ఓపెనర్లు.. లెండల్‌ సిమ్మన్స్‌(67 పరుగులు, 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్‌ లెవిస్‌(40 పరుగులు, 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు.

lendl-simmons

భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వారు ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో నికోలస్‌ పూరన్‌(38) సహాయంతో సిమ్మన్స్‌ లాంఛనాన్ని ముగించాడు. ఇన్నింగ్స్‌ మధ్యలో హిట్‌మైర్‌ 23 పరుగులు చేసి, పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు, టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబే 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషభ్‌ పంత్‌ 33 పరుగులతో ఆకట్టుకొని, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును సాధించిపెట్టగా, మిగితా బాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. కాగా, కీలకమైన మూడో టీ 20 ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ నెల 11న జరుగునుంది.

- Advertisement -