సింహాచలం చందనోత్సవంలో అపశృతి

15
- Advertisement -

విశాఖ- సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఫ్రీ దర్శనం క్యూ లైనులో గోడ పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురు భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు.

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రముఖులే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Also Read:విద్యాసాగర్‌రావుకు ఘన నివాళి…

- Advertisement -