సికిందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే జట్టు టీ20 వలర్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ సూపర్ 8కి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి బలమైన జట్లున్న గ్రూప్‌లో జింబాబ్వే ముందుకు రావడం విశేషం. అయితే కెప్టెన్ రజా మాత్రం జట్టు లక్ష్యం ఇంతటితో ముగియలేదని స్పష్టం చేశాడు.
జింబాబ్వే ప్రయాణం ప్రారంభించినప్పుడు మా లక్ష్యం కేవలం క్వాలిఫై కావడమే కాదు. సూపర్ ఎయిట్స్ ఒక మైలురాయి మాత్రమే, కానీ మేము పెట్టుకున్న పూర్తి లక్ష్యం కాదు. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి అని మ్యాచ్ అనంతరం మీడియాతో రజా పేర్కొన్నారు.
దేశానికి గౌరవం, గుర్తింపు తీసుకురావడం కూడా తమ ముఖ్య లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. గతంలో ఏం జరిగిందో జరిగిపోయిందని, కానీ ఈ జట్టు రెండు సంవత్సరాలుగా ఒక ప్రణాళికతో కష్టపడిందని చెప్పారు. కెన్యాలో సబ్-రిజినల్ క్వాలిఫయర్ నుంచి ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని తెలిపారు.శ్రీలంకతో తదుపరి మ్యాచ్‌పైనే తమ పూర్తి దృష్టి ఉందని, ఒక్కో మ్యాచ్‌ను ఒక్కోసారి మాత్రమే ఆలోచిస్తున్నామని రజా స్పష్టం చేశారు.
Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

