దటీజ్ ఎన్టీఆర్.. ఒక్క అర నిమిషం చాలు

30
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ అదే. ఓ పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై సృష్టించినందుకు తెలుగు తమ్ముళ్లు.. ముఖ్యంగా బాబు అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకు పడ్డారు. ఓ దశలో సోషల్ మీడియాలో కూడా తారక్ పై బాగా ట్రోలింగ్ జరిగింది. సొంత అభిమానులు సైతం ఎన్టీఆర్ పై అసంతృప్తిగా ట్వీట్స్ చేశారు. దీనికితోడు నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జగన్ కి దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకేం ఉంది ?, ఎన్టీఆర్ కంటే నారా లోకేష్ బెటర్ అంటూ తెలుగు తమ్ముళ్లు బాగా డప్పులు కొట్టారు. కానీ జూ.ఎన్టీఆర్ జూ.ఎన్టీఆరే అని నిరూపించాడు తారక్. ఒకే ఒక స్పీచ్ తో తన పై లేచిన నోళ్ళకు తాళం వేశాడు. తన పై పెరిగిన నెగిటివిటీని తరిమి కొట్టాడు.

ఉత్తమ నటుడిగా సైమా అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు’ అంటూ తానూ భావోద్వేగానికి లోనై.. యావత్తు అభిమాన లోకాన్ని భావోద్వేగానికి గురి చేశాడు. ఒక్క అర నిమిషం మాట్లాడే ఎన్టీఆర్ ఇంత చేశాడు అంటే.. అది ఎన్టీఆర్ అంటూ మళ్లీ తారక్ కి నీరాజనాలు పలుకుతున్నారు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు తమ్ముళ్ల పై విరుచుకు పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురుంచి తప్పుగా రాస్తున్నారు. శత్రువు తో పోరాడండి .. కొత్తగా శత్రువులను తయారు చెయ్యకండి. జూ.ఎన్టీఆర్ గారిని నటుడిగా ఇష్టపడే టీడీపీ అభిమానులు లక్షల మంది వున్నారు. అది గుర్తుంచుకుని నడుచుకోండి. జూనియర్ ఎన్టీఆర్ పై తప్పుడు పలుకులు పలికితే.. మళ్లీ అడ్రెస్ గల్లంతు అవుతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులకు, లోకేష్ అనుచరులకు మెసేజ్ లు పెడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకుండానే ఫ్యాన్స్ ను మళ్లీ తన వైపుకు తిప్పుకున్నాడు. దటీజ్ ఎన్టీఆర్.

Also Read:అయ్యో.. నటి జయలలిత పై అత్యాచారం

- Advertisement -