SIIMA 2024: ఉత్తమ నటీ, నటులు వీరే

7
- Advertisement -

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుకలు దుబాయి వేదికగా ఘనంగా జరిగాయి. దక్షిణాది భాషల సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.

ఈ అవార్డ్స్‌లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. 2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ అవార్డును అందుకున్నారు.

ఉత్తమ చిత్రంగా గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ నిలిచింది.సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు.

‘బేబీ’ చిత్రం నాలుగు అవార్డులని సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) గా ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ గా సాయి రాజేష్ , ఉత్తమ డెబ్యు నటి గా వైష్ణవి చైతన్య, ఉత్తమ లిరిక్స్ రైటర్ గా అనంత శ్రీరామ్ గా బేబీ చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ దర్శకుడు పాపులర్ గా శ్రీకాంత్ ఓదెల (దసరా), ఉత్తమ నటి క్రిటిక్స్ గా మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా), బెస్ట్ డెబ్యు డైరెక్టర్ గా శౌర్యువ్ (హాయ్ నాన్న), ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్ గా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న), ఉత్తమ సంగీత దర్శకుడి గా హేషామ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న), ఎమర్జింగ్ యాక్టర్ గా సుమంత్ ప్రభాస్ (మేమ్ ఫేమస్) అవార్డులు అందుకున్నారు.

అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో కనువిందు చేశారు.

Also Read:యూపీఐలో ఒకేసారి రూ. లక్షలు పంపొచ్చు..

SIIMA చైర్‌పర్సన్స్ విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ..’సౌత్ ఇండియన్ సినిమాలోని ది బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతోఆనందం వుంది. ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.

‘సైమా’ 2024 అవార్డ్స్ విన్నర్ :
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ నటుడు పాపులర్ : నాని (దసరా)
ప్రముఖ ఉత్తమ నటి పాపులర్ .: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటి క్రిటిక్స్ : మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా)
ఉత్తమ దర్శకుడు పాపులర్ : శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు క్రిటిక్స్: ఆనంద్ దేవరకొండ(బేబీ)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా
ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ : సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు(మ్యాడ్)
ఉత్తమ ప్రతినాయకుడు : దునియా విజయ్ (వీర సింహారెడ్డి )
ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా (హాయ్ నాన్న)
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
బెస్ట్ డెబ్యు డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న)
ఎమర్జింగ్ యాక్టర్ : సుమంత్ ప్రభాస్
ఉత్తమ డెబ్యు నటి: వైష్ణవి చైతన్య ( బేబీ )
ఉత్తమ డెబ్యు నటుడు : సంగీత్ శోభన్ (మ్యాడ్ )
ఉత్తమ సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నేపథ్య గాయని : శక్తిశ్రీ గోపాలన్ (హాయ్ నాన్న )
ఉత్తమ గాయకుడు : రామ్ మిర్యాల (బలగం)
ఉత్తమ లిరిక్స్ రైటర్ : అనంత శ్రీరామ్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన్ గౌడ (సలార్)

- Advertisement -