అట్లుంటది మనతోని.. డీజేటిల్లు2లో ఎవరోతెలుసా…

133
- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజేటిల్లు సినిమా తెలంగాణ యాస(పూర్తి స్థాయి)లో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించింది. ప్రస్తుతం డీజే టిల్లుకు సిక్వేల్‌ సినిమా షూటింగ్‌తో బీజీగా ఉన్న సిద్దు…తాజాగా దీనికి సంబంధించిన స్టిల్స్‌ను నెట్టింట షేర్‌ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. కార్తికేయ2 చిత్రంతో ఇండస్ట్రీలో మంచి హిట్‌ కొట్టిన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారని..అయితే దీనిపై అఫీషియల్‌ ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందన్ని టాలీవుడ్‌ గుసగుస. అయితే దీన్ని నిజం చేస్తూ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ తాజాగా నెట్టింట్లో ఓ ఫొటో షేర్ చేశాడు.

డీజే టిల్లు2 లో హీరోయిన్ ఎవ‌ర‌నేదానిపై సిద్దు క్లారిటీ ఇచ్చేశాడు. దానికి సంబంధించిన స్టిల్స్‌ను షేర్‌ చేశారు. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న అనుప‌మ స్టిల్‌ను షేర్ చేస్తూ… అట్లుంట‌ది మ‌న‌తోని అని (డీజే టిల్లు చిత్రంలోని పాపుల‌ర్‌ డైలాగ్‌)రాసి ఉన్న బ్లాక్ టీష‌ర్ట్ ను వేసుకున్న స్టీల్స్‌ను నెట్టింట రిలీజ్‌ చేశారు. టీ ష‌ర్ట్ బాగుంది అను..అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. డీజే టిల్లు 2ను పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -