సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చుకుందాం

451
harish rao
- Advertisement -

సిద్దిపేట ను స్వచ్ఛ సిద్దిపేట గా మార్చుకుందామని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రం లోని ఇందిరా నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్, అల్పాహార సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ఈ పాఠశాలను చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నామా, కార్పొరేట్ పాఠశాల లో ఉన్నామా అనిపిస్తుందన్నారు.

ఈ పాఠశాలలో సీట్లు లేవనే విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. తాము పాఠాలు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించడం రాష్ట్రానికి ఆదర్శం అన్నారు. రాష్ట్రానికి ఈ పాఠశాల ఆదర్శంగా ఉంది….పదవ తరగతిలో10/10 సాధించిన విద్యార్థులకు 25 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తానని చెప్పారు.

ఈ పాఠశాల లో వందశాతం ఫలితాలు రావాలి… ఈ పాఠశాలలోని పదవ తరగతి చదివే 20 మంది విద్యార్థులు10/10 సాధిస్తే ఇంచార్జి ఉపాద్యాయులకి10 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పారు. సత్యసాయి ట్రస్ట్ సహకారంతో అన్ని పాఠశాలల్లో ఉచిత అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు.

దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందిస్తాం… కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం…యోగా అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది…యోగాను అందరూ తప్పనిసరి చేయాలన్నారు. మీ అమ్మానాన్నలు కూడా నేర్పించాలి… యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది..దసరా పండగ తర్వాత మరిన్ని పాఠశాల లో అల్పాహారం ప్రారంభిస్తామన్నారు. చెత్త చెదారం రోడ్ల మీద వేయకుండా అందరికి విద్యార్థులు చెప్పాలి .. ప్లాస్టిక్ ని సిద్దిపేటలో నిషేధిస్తున్నాం, ఇంట్లో అమ్మానాన్నలు కూడా వాడకుండా చూడాలన్నారు.

- Advertisement -