ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు: హరీష్ రావు

376
Harish Rao Speech
- Advertisement -

ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్ధలాన్ని అమ్మడం , కొనడం చేయడం నేరం అన్నారు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలోని THR నగర్ లో 40లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ కు ఇవాళ శంకుస్థాపన చేశారు హరీష్‌ రావు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో THR కాలనీని మరింత అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. కోటి 60లక్షలతో మూడు నెలల్లోనే ట్యాంక్ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఈ కాలానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు.

మరో రెండు రోజుల్లోనే ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే అర ఎకరా స్థలంలో శ్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్ వాడి సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు. రోడ్లను కబ్జా చేసి ఇండ్లను నిర్మించొద్దని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు వేప చెట్టు పెంచాలి అని చెప్పారు.

- Advertisement -