రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట..

74
harish
- Advertisement -

కాళేశ్వరంతో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అధిక మేలు జరుగుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లాలోని నారయణరావు పేట మండలం బంజరుపల్లికి చెందిన పిట్ల శంకర్ అనే రైతు పోలంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్‌పామ్ అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

ఆయిల్ పామ్ తోటల పెంపకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, నెలలో రెండుసార్లు క్రాప్ వస్తుందని, ప్రతి నెల రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.3 లక్షల 60 వేలు ఆదాయం ఆర్జించొచ్చని పేర్కొన్నారు. ఏడాదిలో 24 సార్లు పంట చేతికొస్తుందని, దీనిని మంచి భవిష్యత్తు ఉన్న పంటగా చెప్పుకోవచ్చన్నారు.నెలకు రూ.30 వేలు డబ్బు వచ్చే పంటగా అధిక దిగుబడి, అధిక ఆదాయం కలిగిన ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతగానో శ్రేయస్కరమన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -