Harish:ఆయిల్‌ ఫామ్‌కు హబ్‌గా సిద్దిపేట

20
- Advertisement -

పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణం విడుదల చేయాని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం అక్కెనపల్లి లో మొట్టమొదటి అయిల్ పామ్ క్రాప్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. పంట బోనస్ బోగస్ అయ్యింది. విత్తనాల కొరత లేకుండా చూడటంలో ప్రభుత్వ దృష్టి సారించలేదు అన్నారు. ఆయిల్ పామ్ సాగులో కోకో, కాపీ పంట చేసుకునే అవకాశం ఉందని..కోకో సాగు వలన ఆయిల్ పామ్ రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు.

కేంద్రం కస్టం డ్యూటీ మొత్తం ఎత్తివేసింది కావున *పామ్ ఆయిల్ పై కేంద్రం కష్టం డ్యూటీ ఖచ్చితంగా వెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను చిన్న చూపు చూస్తోందని…డాదికి ఇచ్చే క్రాప్ మెంటనెన్స్ 4000వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పై మాట్లాడం లేదు…కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబందు ఇచ్చేదని…పంట సాగుకు ముందే ఎకరాకు రైతుబందు7500 ఇస్తామన్నారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎరువులు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని…అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు హరీష్‌. బోనస్ విషయంలో మంత్రులు తలో మాట, దొడ్డువడ్లకే బోనస్ అని చెప్పడం మాట తప్పడమేనని…అసెంబ్లీలో రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతున్నా అన్నారు.

సిద్దిపేట జిల్లా నుండి కాకుండా, జనగాం, మహబూబాబాద్, గద్వాల్, నారాయణపేట, భువనగిరి ఆయిల్ ఫామ్ పంటలకు ఇది కేంద్రంగా ఉంటుందన్నారు. మూడు ఆయిల్ ఫామ్ నర్సరీలు పెట్టీ, మొక్కలు కూడా అందిస్తున్నాం అన్నారు. రైతులు ముందుకు రావాలి. ఇది మంచి ఆదాయం అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్లు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయన్నారు. 11,268 ఎకరాల్లో సాగుతో ఖమ్మం తరవాత మనమే ఉన్నామన్నారు. ఆయిల్ ఫామ్ బీజం వేసింది ఇక్కడే. ఫ్యాక్టరీ ఇక్కడే రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో సిద్దిపేట ఆదర్శంగా నిలిచింది. కోనసీమ గా ఈ ప్రాంతం మారుతుందన్నారు.మన దేశంలో 40శాతం మాత్రమే ఉత్పత్తి, 60 శాతం దిగుమతి చేసుకుంటున్నాం అని…ఆయిల్ ఫామ్ కు సిద్దిపేట హబ్ అవుతుందన్నారు.

Also Read:బండి సంజయ్‌..కార్యకర్త నుండి కేంద్రమంత్రిగా

- Advertisement -