ఏకాగ్రతను పెంచే ‘ సిద్ధాసనం ‘ !

44
- Advertisement -

యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నప్పటికి సిద్ధాసనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సిద్ద యోగులకు ఎంతో ఇష్టమైన ఆసనంగా దీనిని చెప్పుకుంటారు. పద్మాసనం వలె ఉండే ఈ ఆసనం వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. సిద్దసనం ప్రతిరోజూ వేయడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే జీవక్రియ క్రమబద్దంగా జరుగుతుంది. శ్వాస రోగాలు, హృదయ రోగాలు, అజీర్తి, అతిసారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఈ సిద్దసనం ప్రతిరోజూ వేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వీటితో పాటు పద్మాసనం వేయడం వల్ల ఏవిధమైన లాభాలు కలుగుతాయో అవన్నీ కూడా ఈ సిద్దసనం ద్వారా కూడా లభిస్తాయి.

సిద్ధాసనం వేయు విధానం

ముందుగా నేలపై పద్మాసనం మాదిరిగా కూర్చొని, ఎడమ కాలు మడిమను గుదమునకు మరియు జననేంద్రియమునకు మద్యన ఉంచాలి. ఆ తరువాత కూడికాలి మడిమను జననేంద్రియం యొక్క పై భాగాన ఫోటోలో చూపిన విధంగా ఉంచాలి. రెండు అరికాళ్ళను తొడల మద్య భాగమున ఉండనివ్వాలి. ఆ తరువాత రెండు అరచేతులను మోకళ్లపై జ్ఞాన ముద్రాలో ఉంచాలి. ఆ తరువాత వెన్ను నిటారుగా ఉంచి మెల్లగా శ్వాస తీసుకుంటూ కాస్త వేగంగా శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా ఐదు నిముషాల నుంచి రెండు మూడు గంటల దాకా ఈ ఆసనం వేయవచ్చు.

ఈ ఆసనం పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా వేయవచ్చు. ఈ ఆసనం యొక్క ప్రధాన ఉపయోగం.. మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -