ఈ రోజు చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. వాటిలో నాలుగు సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. మరి వాటి పరిస్థితి ఏమిటో చూద్దాం రండి. ముందుగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ సినిమా విషయానికి వద్దాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా బోర్ కొడుతుంది. కాకపోతే, కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంది. మొత్తంగా రూల్స్ రంజన్ డీసెంట్ మూవీ అనిపించుకోలేకపోయింది.
మరో సినిమా విషయానికి వస్తే.. హీరోయిన్ కలర్స్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘మంత్ అఫ్ మధు’. ఈ సినిమాకు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించగా.. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నవీన్ చంద్ర, శ్రేయ నవిలే, జ్ఞానేశ్వరి, మంజుల, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే దర్శకుడు కథను రెండు భాగాలుగా ఒకే పాయింట్‌తో తెరపై చూపించేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది.
ఇక నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ మూవీ ఇవాళ విడుదలైంది. ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల చుట్టూ తిరిగే కథే ఇది. మూవీలోని కామెడీ సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. కానీ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్‌లు విసుగు తెప్పిస్తాయి. ఎమోషన్ సన్నివేశాలు పెద్దగా పండలేదు.
Also Read:భగవంత్ కేసరి..థియేట్రికల్ ట్రైలర్
నాలుగో సినిమా విషయానికి వస్తే.. హీరో సిద్ధార్థ్ తన శైలి మార్చుకున్నాడు. లవ్ జానర్ వదిలి క్రైం స్టోరీస్ పైన దృష్టి పెట్టాడు. స్వీయ నిర్మాణంలో సిద్ధార్థ్ తీసిన చిత్రం ‘చిన్నా’ ఇవాళ విడుదలైంది. చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారి సంరక్షణకై ఎలా వ్యవహరించాలన్నదే ఈ కథ. సిద్ధార్థ నటన, BGM బాగున్నాయి. సెకండాఫ్ సాగదీత మైనస్. ఓవరాల్ గా ఒక్క మ్యాడ్ సినిమా మాత్రమే ఈ వారం బాగుంది. సో.. ఈ వారం బాక్సాఫీస్ కింగ్ మ్యాడ్ ఒక్కటే.
Also Read:RBI:వడ్డీ రేట్లు యథాతథం