రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

36
- Advertisement -

హీరో సిద్ధార్థ్ – హీరోయిన్ అదితీరావు హైదరీ రహాస్యంగా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయ మండపంలో పెళ్లి జరిగింది.ఇరు కుటుంబాలు, కొంతమంది స్నేహితులకి మాత్రమే ఆహ్వానం అందించారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వాస్తవానికి వీరిద్దరి పెళ్లికి సంబంధించి కొద్దిరోజులగా వార్తలు వస్తున్నాయి. మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరు డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూ వస్తున్నారు. కానీ ప్రేమ, పెళ్లి విషయం పై ఎలాంటి కామెంట్ చేయలేదు.

2007లో విడాకులు తీసుకోని వివాహ బంధానికి సిద్దార్థ్ బ్రేక్ వేయగా అదితి 2012లో విడాకులతో తన మొదటి వివాహ బంధానికి ఎండ్ కార్డు వేశారు.

Also Read:Game Changer:జరగండి సాంగ్ రిలీజ్

- Advertisement -