ఇందిరా,సోనియా బాటలోనే రాహుల్..!

255
rahul
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది కాంగ్రెస్. ఇప్పటికే మూడు లిస్టుల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడ రాహుల్ అమేథి నుండి బరిలో దిగుతున్నారు. అమేథితో పాటు కర్ణాటక నుండి రాహుల్ పోటీచేయాలని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.

కర్ణాటక ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకత్వానికి అండగా ఉన్నారని మాజీ సీఎం సిద్దరామయ్య తెలిపారు.గతంలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ కర్ణాటక నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు. అందుకే రాహుల్‌గాంధీ కూడా కర్ణాటక నుంచి పోటీ చేయాలని కోరుతున్నాం అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

1978లో కర్ణాటకలోని చిక్కమగళూరు లోక్‌సభ ఉప ఎన్నికలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. 1999లో బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుష్మాస్వరాజ్‌పై సోనియాగాంధీ విజయం సాధించారు.

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇక ఈసారి జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవేగౌడ పోటీ నుండి తప్పుకుని తన మనవడికి సీటివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -