ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి సెటైర్లు విసిరారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత మోడీకి లేదని చురకలంటించారు. ప్రధానమంత్రి స్ధాయికి తగ్గట్టుగా మోడీ మాట్లాడటం లేదని..దేశంలోని సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
నోట్ల రద్దుతో ప్రజలను క్యూలైన్లో నిలబెట్టారని.. వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నీరవ్ మోడీని విమానం ఎక్కి పంపించారని ఎద్దేవ చేశారు. కర్ణాటకలో, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, అవేవి తనకు పట్టనట్లు మోడీ వ్యవహరిస్తున్నారని ఎదురుదాడి చేశారు. బాధ్యాతయుతమైన ప్రకటనలు చేయాలని, రాజకీయపరమైన వ్యాఖ్యలు సరికాదని మోడీకి సూచించారు సిద్ధరామయ్య.
నీరవ్ మోడీ ఎగ్గొట్టిన రూ.12 వేల కోట్లలో ప్రజల డబ్బు ఎంత ఉంది అని మోడీని ప్రశ్నించారు సిద్దరామయ్య.
Dear PM @narendramodi ರವರೆ, since you are fond of talking about commission let me ask you-
You made common people stand in queues to deposit their money in the Banks & then let #NiravModi run away with over 12,000 cr of people’s money.
What percent of people’s money is that? pic.twitter.com/whvsOIFYEi
— Siddaramaiah (@siddaramaiah) February 20, 2018