కర్ణాటక ఎన్నికల ఫలితాలలో బీజేపీ భారీ ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఓటమి తప్పేలా లేదు. కర్ణాటక కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి సిద్దరామయ్య రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే . ఇందులో ఛాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్దరామయ్యకు చుక్కెదురయ్యింది. అక్కడ జేడీఎస్ తరపున పోటీ చేసిన దేవగౌడ భారీ విజయం సాధించాడు. 17వేల ఓట్ల మెజారిటీతో దేవగౌడ గెలుపోందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. మొదటి రౌండ్ నుంచి కూడా సిద్దరామయ్య వెనుకంజలో ఉండటం విశేషంగా చెప్పుకొవచ్చు.
ఇక సిద్దరామయ్య పోటీ చేసిన మరో నియోజకవర్గం బదామీ. ఇక్కడ ఆయన స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, బిజెపి అభ్యర్ధి శ్రీరాములుపై 3వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దరామయ్య విజయం సాధించినట్టు ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రకటించారు. కర్ణాటకలో అత్యధిక మెజార్టీతో దూసుకుపోతుంది బీజేపీ. మరోవైపు జేడీఎస్ తో పోత్తుకోసం కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తుది ఫలితాలు వెల్లడిల్లిన తర్వాత కన్నడ పీఠాన్ని ఎవరు సోంతం చేసుకుంటారో తెలుస్తుంది. ఇలా రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసిన సిద్ద రామయ్య ఒక చోటు ఓడిపోయి మరోచోట విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంచెం ఉరట కలిగిందని చెప్పుకొవచ్చు.