దళితుడిని సీఎం చేసేందుకు సిద్దం-సిద్దరామయ్య

336
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు తమ పార్టీ విజయం సాధిస్తుందంటే తమ పార్టీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ ఏర్పాడే అవకాశం ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ మాత్రం జేడీఎస్ మద్దతు కోసం కొత్త వ్యూహం రచిస్తోంది. సీఎం సిద్దరామయ్య తాజాగా ఓ ముఖ్య ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని ప్రకటన చేశారు.

Siddaramaiah says To Congress appoints a dalit as CM

అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవిని ఎవరికి కట్టాబెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకునేది అధిష్ఠానమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య ఓ మెలిక పెట్టారు. గెలిచిన ఎమ్మెల్యేల మాట అధిష్ఠానం వినాలని, వారి ఇష్టాయిష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జేడీఎస్ మద్దతు కోసమే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు రాకపోతే జేడీఎస్ మద్దతు తప్పని సరిగా అవసరం. కానీ ఇప్పటికే బీజేపీతో ఒకసారి పొత్తుపెట్టుకుని చాలా సమస్యలు ఎదుర్కొన్నామని మళ్లీ ఆ తప్పు చేయబోమని జేడీఎస్ అధినేత దేవెగౌడి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండు మా ప్రత్యర్థులే అని దేవెగౌడ్ తెలిపారు. మరి జేడీఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చూడాలి ఇక.

- Advertisement -