- Advertisement -
ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న చిత్రం మహాకాళి. ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
దసరా పండుగ సందర్బంగా ఈ సినిమా నుంచి శుక్రాచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తుండగా లుక్ అదిరిపోయింది.
దేవతల నీడలో శక్తివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు అనే క్యాప్షన్ ను పోస్టర్ తోపాటు యాడ్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read:మద్యం,మాంసం ప్రియులకు షాక్
- Advertisement -

