సౌతాఫ్రికాతో తొలి టీ20కు గిల్

4
- Advertisement -

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9న మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్ ఇండియాకు పెద్ద బూస్ట్ లభించింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్‌..తిరిగి వచ్చాడు.

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయంతో గిల్ క్రీడకు దూరమైన విషయం తెలిసిందే. గిల్ పూర్తిగా కోలుకుని, దక్షిణాఫ్రికాతో జరగబోయే ఐదు టి20ల్లో భారత తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. శుభ్‌మన్ రెడీ. అందుకే ఆయనను ఎంపిక చేశాం. ఆయన ఫిట్, బాగానే ఉన్నారు, ఆడేందుకు ఆతృతగా ఉన్నారు అని మూడో వన్డే విజయం తర్వాత భారత హెడ్ కోచ్ తెలిపారు.

టి20 సిరీస్‌కు ముందు ఎక్కువ శాతం భారత ఆటగాళ్లు భువనేశ్వర్‌కు చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి చాలామంది భారత–దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆదివారం ఉదయం చార్టర్డ్ ఫ్లైట్‌లో భువనేశ్వర్‌కు వచ్చారని సమాచారం. అయితే గిల్ వన్డే జట్టులో లేనందున కొంత ఆలస్యంగా చేరుకున్నారు. ఈ సిరీస్‌లో తొలి టి20 మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లోని బారాబటి స్టేడియంలో జరగనుంది. తదుపరి టి20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో న్యూ చండీగఢ్, ధర్మశాలా, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి.

Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -