పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే అందులో అన్నీ నిజాలే ఉండాలి అని అనుకుంటోంది నేటి యువత. అబద్ధం అనే పదాన్ని కొత్త జంటలు దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా `శుభలేఖ+లు`. ఈ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, జనార్దన్ ఆర్.ఆర్. నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస సాయి హీరో. దీక్ష శర్మ రైనా హీరోయిన్. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రధారులు. శ్రీమతి సి.సుధాసాగర్ సమర్పిస్తున్నారు. సినిమా తొలి కాపీ సిద్ధమైంది.
నిర్మాతలు సి.విద్యాసాగర్, జనార్దన్ ఆర్. ఆర్. మాట్లాడుతూ “అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తొలి కాపీ కూడా సిద్ధమైంది. మా సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. కె.ఎం.రాధాకృష్ణన్ ఓ సినిమా అంగీకరించారంటేనే, అందులో సంగీతానికి ప్రాధాన్యం ఉన్నట్టే. `ఆనంద్`, `చందమామ` జాబితాలో మా సినిమా నిలుస్తుంది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన `వేదవాహిని`అనే పాట సినిమాకు హైలైట్ అవుతుంది. నేషనల్, స్టేట్ అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేసిన కెమెరామేన్ యస్. మురళీమోహన్ రెడ్డి మా సినిమాకు పనిచేశారు. ప్రతి ఫ్రేమ్ ఐఫీస్ట్ గా ఉంటుంది. విజువల్స్ చూస్తే బాలీవుడ్ స్టైల్ మేకింగ్‌లా ఉంటాయి. నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే. అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ ఉండదు. నేచురల్‌గా చేశారు. వాళ్లని చూస్తే మన హైదరాబాద్‌లో ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారా అని అనిపిస్తుంది. ఒక పెళ్లింట్లో జరిగిన 2 ప్రేమ కథల నేపథ్యంలో సినిమా సాగుతుంది. జంధ్యాల సినిమాను మధుర్ భండార్కర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా సినిమా“ అని అన్నారు.
నటీనటులు:అప్పాజీ , డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు తదితరులుసాంకేతిక నిపుణులు:కథ – మాటలు: జనార్దన్ ఆర్.ఆర్. – విస్సు, కథా సహకారం: సి.విద్యాసాగర్, సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్, కెమెరా: యస్. మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: మధు, ఆర్ట్: బ‌్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: శరత్ నర్వాడే.