ప్రజల కోసం పోరాడండి అండగా ఉంటా:కేసీఆర్

20
- Advertisement -

తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన తప్పుల పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్ తమిళనాడులో పర్యటించిన సందర్భాలను గుర్తుచేశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి తెలిపే పుస్తకంతో పాటు 69 శాతం రిజర్వేషన్లకు సంబధించిన నివేదికలను కేసీఆర్ అందజేశారు.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయం లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని శుభప్రద్ పటేల్ కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదు అని దాని అమలు చేసే వరకు ప్రభుత్వం పై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయాలని కేసీఆర్ వివరించారు.

Also Read:మోదీ కోసం ప్రోటోకాల్‌ లేక్కచేయని ఫ్రాన్స్ అధ్యక్షుడు

బీసీ రిజర్వేషన్లు, వారి సంక్షేమ కోసం గత పదేళ్లుగా పార్టీ, ప్రభుత్వం విశేష కృషి చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కరం కోసం పోరాటం చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై ఉద్యమ పంథాను ముందుకు తీసుపోవాలని సూచించడంతో పాటు పార్టీ అండగా ఉంటుందని శుభప్రద్ పటేల్ కు కేసీఆర్ ధైర్యం చెప్పారు.

- Advertisement -