సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. హీరోయిన్ శ్రుతిహాసన్ గత సెప్టెంబర్ నుంచి ఇలాంటి చేదు అనుభవాన్నే ఫేస్ చేస్తోంది. అది కాస్త శృతి మించడంతో ఈ భామ ఇప్పుడు వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వళ్తే.. కర్ణాటకకు చెందిన కేజీ గురుప్రసాద్ అనే వైద్యుడు ట్విట్టర్ ద్వారా ఈ వేధింపులకు పాల్పడుతున్నాడు. సెప్టెంబరు 7 నుంచి గురుప్రసాద్ శృతిహాసన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ఈ మెసేజ్‌లు చేస్తున్నాడు. అంతేకాదు అసభ్యపదజాలం వాడుతూ.. శృతిని చంపేస్తానని బెదిరిస్తున్నాడట. దీంతో శృతిహాసన్ చెన్నై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది .ట్విట్టర్‌లో ఆ వ్యక్తి తనకు పెట్టిన మెసేజ్‌లను శ్రుతి స్క్రీన్ షాట్స్ తీసి ఫిర్యాదుకు జత చేసిందట. శృతిహాసన్ కు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.2013లో ముంబయిలోని బాంద్రాలోగల తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు శృతిపై ఎటాక్ చేశాడు. అప్పట్లో ఆమె ఈ ఘటన నుంచి తప్పించుకుంది.
- Advertisement -
- Advertisement -