నాకు సంబంధం లేదు.. నేను పట్టించుకోను

221
Online News Portal
Shruti Haasan reason behind Gauthami and Kamal's split!
- Advertisement -

కమల్ కొన్ని సంవత్సరాలుగా గౌతమితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహ జీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి ప్రకటించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని.. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గౌతమి తీసుకున్న ఈ నిర్ణయంపై శృతి హాసన్ స్పందించింది.

‘విడిపోవడం అనేది కమల్‌, గౌతమి వ్యక్తిగత నిర్ణయం. దానితో నాకు సంబంధం లేదు. వారి వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై నేనెప్పుడూ మాట్లాడను. నాకు నా తల్లిదండ్రులు, చెల్లెలే ముఖ్యం. వివాదాలను నేనెప్పుడూ పట్టించుకోన’ని శృతి కుండబద్దలు కొట్టింది.

kamal

కాగా, ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమాకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే గౌతమి-శృతి హాసన్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇక శృతి, కమల్‌లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య పెరిగిన ప్రేమ.. గౌతమి-కమల్‌ల మధ్య చిచ్చు పెట్టిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇక శభాష్‌ నాయుడు సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లినపుడు.. షూటింగ్ ప్రారంభమైన నాలుగో రోజునే దర్శకుడు రాజీవ్‌కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దర్శకుడి అనారోగ్యం కారణంగా సినిమా వాయిదా పడింది. మళ్లీ దర్శకుడు రాలేని పరిస్థితుల్లో కమల్ హాసన్ దర్శకత్వ భాద్యతలు తీసుకున్నాడు. ఇక కమల్ హాసన్ తన ఆఫీస్ మెట్ల మీద నుండి పడిపోవడంతో డాక్టర్స్ రెండు నెలలు వరకు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కాస్త సెప్టెంబర్ కు వాయిదా పడింది. మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. అపుడే గౌతమి-శృతిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని టాక్. అవి వారీద్దరు విడిపోయేదాకా వచ్చింది. కామెడీ శభాష్ నాయుడు కమల్‌ని ఇంకా ఎంత ఏడిపిస్తుందో చూడాలి.

కామెడీ- అడ్వెంచరస్ చిత్రంగా తెరకెక్కుతున్న శభాష్ నాయుడులో కమల్ హాసన్, ఆయన కూతురు శృతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కమల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

sabash_naidu

- Advertisement -