రవితేజ సరసన శృతి మరోసారి..

264
Shruti Haasan In Ravi Teja Next Movie
- Advertisement -

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఈ సారి మాస్ మహారాజ రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంథోని’ అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. ఇందులో రవితేజ త్రిపాత్రభినయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాను మైత్రిమూవీ సంస్థ నిర్మిస్తోంది.

Shruti Haasan In Ravi Teja Next Movie

ఇక విషయానికొస్తే రవితేజ సరసన హీరోయిన్‌గా అనుఇమ్మాన్యుయెల్‌ చేస్తున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవటంతో మరో హిరోయిన్ వేటలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఈ మూవీ నుంచి తప్పుకోవటంపై స్పందించిన అను..తానెలాంటి సమస్యలతో తప్పుకోవటం లేదని, ఇతర సినిమాలు చేతిలో ఉండటంతోనే ఈ సినిమాను చేయలేకపోతున్నానని స్ఫష్టం చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఆ స్థానంలో నటీ శృతిహాసన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బలుపు’ చిత్రం తర్వాత రవితేజతో శృతిహాసన్ మరోసారి కలిసి నటించనుంది. ఇక మరో హీరోయిన్‌గా ఎంపికైంది గోవా బ్యూటీ ఇలియానా. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు రవితేజ సరసన మరోసారి నటించడానికి సిద్దమైంది.

- Advertisement -