సంఘమిత్ర నుంచి తప్పుకుంది…!

245
Shruthi Hassan Rejects Sangamithra..!
- Advertisement -

బాహుబ‌లి2, 2.0 చిత్రాల‌కు పోటీగా సంఘ‌మిత్ర చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా  ఆర్య‌, జ‌యం ర‌వి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్నారు. ఇక ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ లుక్స్‌ని కేన్స్‌లో విడుదల చేశారు. వీటిల్లో ఒకటి హీరో ఆర్యకి సంబంధించినది కాగా, ఇంకొకటి శృతిహాసన్‌కి సంబంధించింది. ఈ పస్ట్ లుక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగ  రెండు లుక్స్‌నీ భారీ స్థాయిలో డిజైన్‌ చేయడం చూస్తోంటే, సినిమా ఏ స్థాయి భారీతనంతో తెరకెక్కనుందో  అర్థం చేసుకోవచ్చు.

Shruthi Hassan Rejects Sangamithra..!
ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా విదేశాల్లో ‘కత్తి యుద్ధాలకు’ సంబంధించిన శిక్షణ తీసుకుంది శృతిహాసన్‌. మరోపక్క, ఆర్య తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుంది. ఈ సినిమాలో పాత్ర కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్న శృతి  ఆ క‌స‌ర‌త్తులకి సంబంధించిన వీడియోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం సంఘ‌మిత్ర చిత్రం నుండి శృతి త‌ప్పుకుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ థెండాళ్ ఫిలింస్ ప్ర‌క‌టించింది. మ‌రి అర్ధాంత‌రంగా శృతి ఈ ప్రాజెక్టు నుండి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలేంటనేది తెలియాల్సి ఉంది. సంఘ‌మిత్ర చిత్రం వ‌చ్చే ఏడాది పట్టాల‌పైకి వెళ్ళ‌నుండ‌గా, ఈ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.

- Advertisement -