సూపర్‌స్టార్ రజనీకాంత్ పై ప్రశంసలు గుప్పించారు హీరోయిన్ శృతి హాసన్. రజనీ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “కూలీ” 2025 ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, మరియు సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా రజనీతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పింది శృతి హాసన్. నాన్న (కమల్ హాసన్) మరియు ఆయన (రజనీకాంత్ ) ఇద్దరూ తమిళ సినిమాకి దృఢమైన స్థంభాలు. రజినీ సార్‌ను అందరిలాగే నేనూ చిన్ననాటి నుంచి సూపర్‌స్టార్‌గా చూసుకుంటూ వచ్చాను. కానీ కూలీ షూటింగ్ సమయంలో ఆయనను దగ్గరగా తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది అని చెప్పారు.
అయన ఎన్నో ప్రత్యేకమైన లక్షణాల కలయిక. ఆయన చాలా తెలివైనవారు, రేజర్‌లా షార్ప్‌గా ఉంటారు, కానీ అదే సమయంలో ఎంతో వార్మ్‌గా, కూల్‌గా ఉంటారు. నేను ఆయనకి చెప్పాను కూడా – ‘మీరు చాలాకూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు’ అని. ఆయన సెట్‌లోకి వచ్చారంటే అంతా ఎనర్జీతో నిండిపోతుంది అందుకే అందరూ ఆయనతో పని చేయడానికి ఎంతో సంతోషంగా ఫీలవుతారు అని ప్రశంసలు గుప్పించారు శృతి.
Also Read:కమిన్స్ సలహాతోనే..రాణించా!

