అందరిదీ ఓ బాధ ఐతే, ‘శ్రుతి’ది మరో బాధ

16
- Advertisement -

సలార్ దెబ్బకు హీరోయిన్ శ్రుతి హాసన్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఫేడ్ అవుట్ దశ నుంచి ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది. నిజానికి సలార్ లో ఆమె పాత్ర ఓ సైడ్ పాత్ర లాంటిది. కానీ, మెయిన్ హీరోయిన్ లాగా ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. సినిమాలో శ్రుతి హాసన్ కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి ఒక్కసారిగా భారీ పాపులారిటీ వచ్చేసింది. గతంలో తనకు బాలీవుడ్ లో రాని గుర్తింపు, సలార్ తో సొంతం చేసుకుంది శ్రుతి హాసన్. ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఆమెనే పిలుస్తున్నారు.

అంతేకాదు, గత నెలలో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లో శ్రుతి హాసన్ కూడా ఒకరు. ఆ రేంజ్ లో శ్రుతి హాసన్ ‘సలార్’తో భారీ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అటు సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంత తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ రావడం ఎలా అనిపిస్తుందని అడిగితే.. శ్రుతి హాసన్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. శ్రుతి హాసన్ మాట్లాడుతూ. “ఏం అని చెప్పాలి ?, సలార్ రిలీజ్ తర్వాత నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అదేమిటి ? అంటే.. శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ‘ఎందుకంటే సలార్ సినిమా హిట్ అయిన తర్వాత నాకు సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి అనేక మెసేజ్ లు, కాల్స్ రాత్రి పగలు అనే తేడా లేకుండా నాన్ స్టాప్ గా వచ్చేవి. అందుకే, నాకు ఇన్ని రోజులు కూడా అసలు నిద్ర అనేది సరిగ్గా లేదు” అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. పైగా తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతుందట. తనతో సుఖంగా పడుకొని చాలా రోజులు అయ్యింది అని చెబుతుంది శ్రుతి హాసన్. అందరిదీ ఒక బాధ అయితే, శ్రుతి హాసన్ ది మరో బాధలా ఉంది.

Also Read:TTD:6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -